BREAKING
ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మిర్యాలగూడకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు – తీన్మార్ మల్లన్న బియ్యం ధరలపై కీలక నిర్ణయం! భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

కృష్ణ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న దక్షిణ భారత తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు

Select Suryaa Now
కృష్ణ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న దక్షిణ భారత తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు

కృష్ణ సూర్య న్యూస్ :
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ రైల్వే స్టేషన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన, అత్యాధునిక వందే భారత్ రైలు సేవలు ఇకపై  కృష్ణ రైల్వే స్టేషన్ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయని బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప,మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రారంభమవుతున్న 'వందే భారత్ స్లీపర్' రైలు బెంగళూరు నుండి కృష్ణ మీదుగా ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలు సాగించనుందన్ని పేర్కొన్నారు.
ముఖ్యంగా నవంబర్ 1 ఆదివారం నుంచి (ట్రైన్ నెంబర్ 06503 ) గల వందేభారత్ స్లీపర్ రైలు  ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో నియోజకవర్గ ప్రజలకు ఎంతో కాలంగా ఉన్న మెరుగైన రైలు రవాణా కల నెరవేరడమే కాకుండా, విమాన స్థాయి సౌకర్యాలతో కూడిన ఈ రైలు ప్రయాణం సామాన్యులకు సైతం చేరువైందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు వేళలు ప్రతిరోజు రాత్రి 7:40 నిమిషాలకు  వందే భారత్ రైలు కృష్ణ రైల్వే స్టేషన్ కు చేరుకుని 7: 50 నిమిషాలకు బయలుదేరుతుందని వారు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కృష్ణ స్టేషన్‌లో 10 నిమిషాల పాటు రైలు ఆగనుందన్నారు. 
ముఖ్యంగా కృష్ణ లాంటి గ్రామీణ ప్రాంత స్టేషన్‌లో కూడా వందే భారత్ స్లీపర్ రైలు నిలుపుదలకు ప్రత్యేక కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ కి మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి కృష్ణ మండల ప్రజల తరఫున బీజేపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, ప్రయాణికులు, ప్రజలందరూ ఈ సుదూర ప్రాంత ప్రయాణ సౌకర్యాన్ని, అత్యాధునిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.

 

నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం