BREAKING
పేదరిక రహిత దిశగా భారత్ నేడే (ఆదివారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి -- దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం –నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన -- ఏవో బ్రహ్మ రెడ్డి బాలలు పనిలో కాదు.. బడిలో ఉండాలి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియో వైద్యులు కరుణాకర్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ మండల స్థాయిలో జంపని విద్యార్థులు ప్రథమ స్థానం ఇందిరాగాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.… సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, షేక్ హాజీ గౌస్ రాప్తాడు ఘటనపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా సంక్షేమం జగన్ తోనే సాధ్యం -- వరికూటి అశోక్ బాబు గీతం లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీ ప్రారంభం భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి.... * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం *

సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Select Suryaa Now
సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడికి తావులేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

శనివారం విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన్ లో గల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు.

గత మూడు, నాలుగు నెలలుగా విస్తృత స్థాయిలో సమీక్షలు

ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత మూడు, నాలుగు నెలలుగా వివిధ స్థాయిల్లో అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపినట్లు వివరించారు.

చీఫ్ సెక్రటరీ, డీజీపీతో కూడా ఎన్నికల ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పాటు అబ్జర్వర్స్ తో కూడా సమావేశమై ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతలు, ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించడమే లక్ష్యం

రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం తమ మొదటి ప్రాధాన్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే తగిన శిక్షణ అందించినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని స్థాయిల్లో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్ల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నోటిఫై చేసినట్లు కమిషనర్ తెలిపారు.

వీటిలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలను మినహాయించి, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.

మొత్తం 3,942 వార్డులకు గాను 756 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో 118 మంది, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 638 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 17 మంది చైర్‌పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

పోలింగ్ సిబ్బంది, ఎన్నికల విధుల కేటాయింపు

ఎన్నికల నిర్వహణ కోసం వివిధ స్థాయిల్లో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వివరించారు.

- ఆర్‌ఓలు (రిటర్నింగ్ అధికారులు): 1,449 మంది 
- ఏఆర్‌ఓలు: 2,543 మంది 
- ప్రిసైడింగ్ అధికారులు: 13,504 మంది 
- అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 13,504 మంది 
- ఇతర పోలింగ్ అధికారులు: 51,716 మంది 
- మైక్రో అబ్జర్వర్లు: 3,720 మంది 
- వెబ్‌కాస్టింగ్ సిబ్బంది: 1,835 మంది

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వెబ్‌కాస్టింగ్, అవసరమైన చోట్ల ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని ముందుగానే ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.

గతంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్నికలకు సంబంధించిన వీడియో ఫుటేజీ భద్రపరిచే గడువును 40 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించినట్లు వివరించారు.

అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల వివాదాలకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ లేదా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో సంబంధిత వీడియో ఫుటేజీని కేసుల పరిష్కారం అయ్యే వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ సన్నద్ధత

ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, అనంతరం నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు కొనసాగనున్నాయని కమిషనర్ తెలిపారు.

ఈ ఎన్నికల కోసం ఇప్పటికే జనరల్ అబ్జర్వర్లను నియమించడంతో పాటు ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లను కూడా నియమించినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ, ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును కల్పించేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ...

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు

పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ పోలింగ్ స్టేషన్లుగా వర్గీకరించడం జరిగిందన్నారు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాల్లో 1+4, సెన్సిటివ్ కేంద్రాల్లో 1+2 విధానంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ బాక్సుల సురక్షిత రవాణా, రూట్ క్లియరెన్స్, భద్రత కోసం 1,543 రూట్ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ అనంతరం కలెక్షన్ పాయింట్లు, స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపునకు రూట్ మొబైల్స్ వినియోగీస్తున్నామన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక బలగాలు

- ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు డీఎస్పీలు, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సుల ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పించేందుకు ఏపీ స్పెషల్ పోలీస్ బలగాలు ఏర్పాటు చేశామన్నారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు.

మొత్తం 36,351 మంది పోలీస్ బలగాల మోహరింపు

- ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 36,351 మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సీనియర్ పోలీస్ అధికారులు, డీఐజీలు, ఐజీల పర్యవేక్షణలో రిజర్వ్ బృందాల ఏర్పాటు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణమే స్పందించేందుకు క్విక్ రియాక్షన్ టీమ్‌ల నియామకం చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున తెలిపారు.

ఐజీ బి. రాజకుమారి మాట్లాడుతూ... ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

- హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1+4, 1+2 విధానంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
- బ్యాలెట్ బాక్సుల సురక్షిత రవాణా, రూట్ క్లియరెన్స్ కోసం 1,543 రూట్ మొబైల్స్ ఏర్పాటు.
- శాంతిభద్రతల సమస్యలపై తక్షణం స్పందించేందుకు డీఎస్పీ, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సుల ఏర్పాటు.
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం.
- సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కోసం  ఏపీ స్పెషల్ పోలీస్ బలగాలు మోహరింపు.
- ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 36,351 మంది పోలీస్ సిబ్బంది నియామకం.
- అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సీనియర్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో రిజర్వ్ బృందాలు, క్విక్ రియాక్షన్ టీమ్‌ల ఏర్పాటు.

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఐజీ బి. రాజకుమారి తెలిపారు.

సీడీ ఎమ్ఏ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ...పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.

- రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 153 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్ని కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.
- 70 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులకు 367 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
- కార్పొరేషన్లలోని 922 వార్డులకు 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- మున్సిపాలిటీల్లోని 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 9,642 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ.
- ఇప్పటికే 6,600 ప్రాంతాల్లో సుమారు 12,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు.
- సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా. వీటి పరిధిలో సుమారు 5,500 ప్రాంతాలు గుర్తింపు.
- ఎన్నికల విధుల కోసం సుమారు 75,000 మంది పోలింగ్ సిబ్బంది నియామకం.
- పోలింగ్ సిబ్బంది డిస్పాచ్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాత్రి 8 గంటలకల్లా అందరూ తమకు కేటాయించిన స్థానాలకు చేరుకునేలా చర్యలు.
- పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించేలా ఏర్పాట్లు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డాక్టర్ పి. సంపత్ కుమార్ తెలియజేశారు.