BREAKING
బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత! ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి... ఎన్నికల విధులకు 1,100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మిర్యాలగూడకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు – తీన్మార్ మల్లన్న బియ్యం ధరలపై కీలక నిర్ణయం! భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం.. కన్నీరు పెడుతున్న రైతన్న పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు బిరదవోలులో సుమలత ప్రచార జోరు .. అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హరీష్ వర్ధన్ ముదిరాజ్....… కూటమి విజయానికి సాయిబాబా సన్నిధిలో హోమం

నేడే (ఆదివారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

Select Suryaa Now
నేడే (ఆదివారం)  మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

బుచ్చిరెడ్డిపాలెం,  మేజర్ న్యూస్ :    మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు  పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.  ఆదివారం నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీలలో   పోలింగ్‌  జరగనున్న నేపథ్యంలో శనివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌  పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని డి ఎల్ ఎన్ ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామాగ్రిని ముందుగానే సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు.