BREAKING
పెన్షన్ వెరిఫికేషన్లో పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి జడ్పిటిసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఉగ్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీనివాస్ విఠలాపూర్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం -గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం.. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్. అకాల వర్షానికి తడిసిన ధాన్యం...... లంకతోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార హోరు ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టిడిపిలో చేరిన 18కుటుంబాలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌–2026లో మెదక్ జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత...... బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది ఆశీర్వదించండి,గెలిపించండి జిల్లా వాలీబాల్‌ విజేతగా ఆదర్శ పాఠశాల గుడ్లవల్లేరు మండలంలో పార్టీల ప్రచార హోరు శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత!

దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం –నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన -- ఏవో బ్రహ్మ రెడ్డి

Select Suryaa Now
దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం –నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన -- ఏవో బ్రహ్మ రెడ్డి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ బాగా గుర్తించదగిన అల్పపీడన ప్రాంతంగా మార నున్నదని మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మారెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 31న అందిన తాజా సమాచారం ప్రకారం, ఇది తదుపరి గం 12 లలో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 2 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.
భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి) అక్టోబర్ 31న విడుదల చేసిన ఉపవిభాగాల వారీ వర్షపాత హెచ్చరికల ప్రకారం నవంబర్ 1న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, నవంబర్ 2, 3 తేదీల్లో అతి భారీ వర్షాలు, నవంబర్ 4న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలకు సూచనలున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో రైతులు కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంటలను సురక్షితంగా నిల్వ చేసుకోవాలి, కోసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోవాలని, పత్తి, మిరప, ఉద్యాన పంటల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను సిద్ధం చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎరువులు, పురుగుమందుల పిచికారీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏవో బ్రహ్మ రెడ్డి రైతులకు సూచించారు.