BREAKING
దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం –నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన -- ఏవో బ్రహ్మ రెడ్డి బాలలు పనిలో కాదు.. బడిలో ఉండాలి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియో వైద్యులు కరుణాకర్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ మండల స్థాయిలో జంపని విద్యార్థులు ప్రథమ స్థానం ఇందిరాగాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.… సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, షేక్ హాజీ గౌస్ రాప్తాడు ఘటనపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా సంక్షేమం జగన్ తోనే సాధ్యం -- వరికూటి అశోక్ బాబు గీతం లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీ ప్రారంభం భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి.... * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం * జోరుగా కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచారం గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం

హిరమండలం, సూర్య : ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హిరమండలం బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి త్రివేణి తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పిస్తే హిరమండలం మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మండలంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటి ప్రయోజనాలను వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.