BREAKING
విద్యుత్ షాక్ తో మహిళ మృతి నార్త్ మోపూరు గ్రామ ప్రతినిధుల బృందం బీద రవిచంద్రకు వినతిపత్రం గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో: పోగుల సైదులు గౌడ్

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో: పోగుల సైదులు గౌడ్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో: పోగుల సైదులు గౌడ్

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన రూ.8,592 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు మారినా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచే బకాయిల సమస్యను పెండింగ్‌లో ఉంచిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకున్న విద్యార్థులు కోర్సులు పూర్తిచేసిన తర్వాత బకాయిల కారణంగా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి, చెల్లింపులకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయకుండా కాలేజీ యాజమాన్యాలకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేస్తూ, వారి భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు వడ్డెబోయిన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.