నార్త్ మోపూరు గ్రామ ప్రతినిధుల బృందం బీద రవిచంద్రకు వినతిపత్రం
నెల్లూరు, మేజర్ న్యూస్ : అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామానికి చెందిన ప్రతినిధుల బృందం సోమవారం నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్రను, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన అంశాలపై వారు నాయకుల దృష్టికి తీసుకెళ్లి తమ వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.