విద్యుత్ షాక్ తో మహిళ మృతి
సీతంపేట, సూర్య : విద్యుత్ షాక్ తో మహిళ 45 మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ మండలం హడ్డుబంగి గ్రామానికి చెందిన బిడ్డిక పెంటమ్మ పశువులు మెపుకోసం పొలానికి వెళ్లింది. ఐతే 33 కే వి లైన్ విద్యుత్ వైరు ఇటీవల తుఫాన్ కు వేళా డి ఉంది పెంటమ్మ వైరు ను గమనించక పోవడంతో వైరు తాక గానే మృతి చెందింది. విషయం తెలిసి మహిళలే ఊర్లోకి తెచ్చారు. గ్రామస్థులు, వి ఆర్ ఓ అలివేలు ఫిర్యాదు మేరకు సీతంపేట ఏరియా ఆ సు పత్రికి తరలించారు. స్థానిక ఎస్ ఐ వై అమ్మన్న రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా జరిపి పోస్టు మార్టం జరుగు తుందని ఎస్ ఐ అమ్మన్న రావు శనివారం తెలిపారు.