BREAKING
గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు... మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం విరువూరు, పాపన్నగారిపల్లిలో కూటమి ప్రచార సందడి! సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష.. -- అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యం -- నారాయణపేటలో పోలీసుల ఫ్లాష్ వాక్ – బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి -- నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ప్రజాదరణతో ముందుకెళ్తున్న ఎన్డీయే కూటమి బ్రహ్మాసముద్రం లో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం జోరు. అభివృద్ధిని చూడండి శ్రీనివాసవర్మను గెలిపించండి

గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Select Suryaa Now
గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

కలిగిరి,  మేజర్ న్యూస్   :    ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం కలిగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాలెం, చిన్న అన్నలూరు, క్రాకుటూరు, పెదకొండూరు, లక్ష్మీపురం, వెలగపాడు, కలిగిరి, నాగసముద్రం తదితర పంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచార సరళి, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నాయకులతో సమాలోచనలు జరిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పూసాల వెంగపనాయుడు, మెట్టుకూరి చిరంజీవిరెడ్డి,,జడ్పీటీసీ అభ్యర్థి మెట్టికూరి శిరీషారెడ్డితో , బిజ్జం కృష్ణారెడ్డి , బిజ్జం ఖాజా కుమారి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు స్థానిక  నాయకులు డబ్బుగుంట మాలకొండయ్యా , చుండి కృష్ణారెడ్డి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.