ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి
పాచిపెంట, సూర్య : స్థానిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ ప్రచారం జోరందుకుంది. ఎంపీపీ అభ్యర్థి బాబ్జి, జడ్పిటీసీ అభ్యర్థి పుష్ప శనివారం పాచిపెంట మండలంలో విశ్వనాధపురం, పి కోనవలస, మంచాడవలస సెగ్మెంట్ పరిధిలో ప్రచారము చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో వైసీపీ అభిమానులు హోరెత్తించారు. వందలాదిమంది హాజరై ప్రచారాన్ని విజయవంతం చేశారు. విశ్వనాధపురం సెగ్మెంటు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని ముందుగానే ఆ పార్టీ నాయకులకు శనివారం ప్రచారం సంకేతాలు పంపింది. భారీ ఎత్తున అభిమానులు పాల్గొని వైయస్సార్ పార్టీకి మద్దతు పలికారు. తర్వాత పి కొనవలస, కర్రి వలస గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఇంటింటా ప్రచారానికి మంచి ఆదరణ లభించింది. ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి ఓటర్లు ఆదరించారు. మేళ తాలాలతో అభ్యర్థులకు స్వాగతం పలికి మీకు మేము అండగా ఉంటామని మీకు ఓటు వేసి గెలిపిస్తామని ముందుకు వచ్చారు. మండల అధ్యక్షులు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మండల అభివృద్ధికి కృషి చేస్తానని డోల బాబ్జి పేర్కొన్నారు. ఆడిన మాట తప్పనని నా గురించి మండల ప్రజలకు తెలుసని అందుకే వారి మాట ప్రకారమే నేను ఈ పోటీలో పాల్గొన్నానని వెల్లడించారు. మీరంతా నాకు మద్దతు పలికి నన్ను, జడ్పిటిసి అభ్యర్థి కలువలపల్లి పుష్పను స్థానిక ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మండలం అభివృద్ధి చెందాలంటే వైయస్సార్ పార్టీ ప్రభుత్వం రావాలని మీరంతా సహకరించాలని కోరారు. నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీరంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కొటికి పెంట సెగ్మెంట్ పరిధిలో మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, సీనియర్ నాయకులు సలాది అప్పలనాయుడు తమ అభ్యర్థి అభిమానులతో ప్రచారం చేపట్టారు. ప్రజలు వారికి మద్దతుగా నిలిచారు. ర్యాలీ నిర్వహించారు. పలువురు అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.