ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
గుంటూరు, మేజర్‌న్యూస్ :
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
• ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్టు ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
• రేపటికి ఈ వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని వెల్లడి
• దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని గుంటూరు నుంచి దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని తెలియచేసిన అధికారులు
• నవంబరు 2, 3, 4 తేదీల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం
• ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్ రాడార్ల సాయంతో ముందస్తుగా తుఫాను గమనాన్ని అంచనా వేసి తగిన చర్యలు చేపట్టాలని సూచించిన ముఖ్యమంత్రి
• సమీక్షకు హాజరైన ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా వివిధ టెలికాం ఆపరేటర్ల ప్రతినిధులు