BREAKING
టైర్ల పరిశ్రమల దుర్వాసనతో ప్రజల విలవిల.. తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం *బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ తెలంగాణ రక్షణ సేనలో సంగారెడ్డి నియోజకవర్గానికి నూతన నియామకాలు

అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం..

Select Suryaa Now
అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం..

విజయవాడ,  మేజర్‌న్యూస్‌ :

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY-NRLM) ఆధ్వర్యంలో ఏపీ సెర్ప్‌తో క‌లిసి విజ‌య‌వాడ పున్న‌మిఘాట్ వ‌ద్ద 19 రోజులుగా జ‌రుగుతున్న నిర్వ‌హించిన జాతీయ స‌ర‌స్ మేళా-2026 మ‌హిళా శ‌క్తిని చాటిచెప్పింది. ల‌ఖ్‌ప‌తిదీదీల సాధికార‌త‌కు స‌రికొత్త ఊపు తెచ్చింది.  
గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనకు మేళా ఒక విజయవంతమైన వేదికగా నిలిచింది.
మేళా ముగుస్తున్న స‌మ‌యంలో శ‌నివారం స‌ర‌స్ ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్,సెర్ప్ డైరెక్ట‌ర్లు చ‌క్ర‌వ‌ర్తి, శివ‌శ‌కంర్, స‌ర‌స్ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌టారియా త‌దిత‌రులు అత్యుత్త‌మ స్టాళ్ల ల‌ఖ్‌ప‌తిదీదీల‌కు స‌ర్టిఫికెట్లు అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తొలిసారి ఢిల్లీని దాటి స‌ర‌స్ విజ‌య‌వాడ వ‌చ్చింద‌ని... ఈ మేళా మహిళా శక్తి సామర్థ్యాన్ని, గ్రామీణ మహిళల పారిశ్రామిక ప్రతిభను చాటిచెబుతూ ఘన విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ జాతీయ స్థాయి మేళాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, సందర్శకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 50 లైవ్ ఫుడ్ స్టాళ్ల‌తో పాటు మొత్తం 650 వ‌ర‌కు స్టాళ్లు ప్ర‌జ‌ల‌కు మ‌ధురానుభూతుల‌ను మిగిల్చాయన్నారు.
స‌ర‌స్ మేళా ఓ అద్భుత వేదిక‌:
గ్రామీణ మహిళల్లో అపారమైన నైపుణ్యం, సృజనాత్మకత, వ్యాపార సామర్థ్యం దాగి ఉన్నాయని, వాటిని సరైన మార్కెట్ అవకాశాలతో అనుసంధానిస్తే వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ దిశగా స‌ర‌స్ ఆజీవిక మేళా  ఒక అద్భుతమైన జాతీయ వేదికగా నిలిచిందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, గృహోపకరణాలు, సంప్రదాయ కళాఖండాలు, ఆహార పదార్థాలు, ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, కళానైపుణ్యాలు, ఆహార వైవిధ్యాన్ని ఒకే వేదికపై పరిచయం చేయడంలో స‌ర‌స్ విజయవంతమైందన్నారు. లఖ్‌పతి దీదీలుగా ఎదుగుతున్న మహిళలకు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు పరిచయం చేసుకునేందుకు, కొత్త కొనుగోలుదారులను సంపాదించుకునేందుకు, వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో దోహదపడిందన్నారు.
మహిళల కృషికి రూ. 12.11 కోట్ల ప్రతిఫలం:
స‌ర‌స్ మేళాలో నమోదైన రూ. 12.11 కోట్ల అమ్మకాలు మహిళా స్వయం సహాయక సంఘాల కృషి, నాణ్యమైన ఉత్పత్తులు, వ్యాపార నైపుణ్యానికి ప్రతిబింబమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అమ్మకాలు మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన స్టాళ్ల ద్వారా దాదాపు రూ. 2 కోట్ల వ‌ర‌కు అమ్మ‌కాలు జ‌రిగాయి.
నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక వర్క్‌షాప్‌లు:
స‌ర‌స్ మేళా సందర్భంగా దేశవ్యాప్తంగా పాల్గొన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. బిగ్ బ్రాండ్ ఫ‌ర్ స్మాల్ బిజినెస్‌, సెల్ ఆన్‌లైన్ గ్రో ఫాస్ట్‌, సోష‌ల్ కామ‌ర్స్ త‌దిత‌ర శీర్షిక‌ల‌తో ఉత్పత్తుల నాణ్యత పెంపు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యూహాలు, ధరల నిర్ణయం, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ విక్రయాలు, ఎగుమతి అవకాశాలు, వ్యాపార నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. కొనుగోలుదారులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవడం, తమ వ్యాపారాలను విస్తరించుకోవడంపై ఆచరణాత్మక సూచనలు అందించారు. మ‌హిళ‌లు సమర్థవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇవి దోహ‌ద‌ప‌డ్డాయి.
సాంస్కృతిక వైవిధ్యం@ స‌ర‌స్‌:
స‌రస్ మేళాలో ప్ర‌తిరోజూ సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు మేళా ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా రాష్ట్రాల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు జాతీయ సమైక్యత, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేళాకు మరింత శోభను తీసుకొచ్చి సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాయి.
భాగ‌స్వాములైన ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు:
స‌ర‌స్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్టాల్ నిర్వాహకులు, కళాకారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు జిల్లా కలెక్టర్, సెర్ప్ ఉన్న‌తాధికారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఎన్‌టీఆర్ జిల్లా డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
సందర్శకుల విశేష ఆదరణ.. వారి కోరిక మేరకు నవంబర్ 1న కూడా మేళా కొనసాగింపు!
స‌ర‌స్ మేళాకు సందర్శకుల నుంచి లభించిన విశేష స్పందన, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 1వ తేదీ సాయంత్రం వ‌ర‌కు కూడా మేళాను కొనసాగించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లలోని విభిన్న ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలకు మరో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.