BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం

Select Suryaa Now
జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం

జిన్నారం;జిన్నారం మున్సిపల్ కేంద్రానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ఆదివారం 45 రోజుల మండల దీక్షలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. జిన్నారం కోదండ రామాలయంలోని సన్నిధానంతో పాటు వీరన్నగూడెం సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం సంతోష్, ఆనంద్ గురుస్వామిల ఆధ్వర్యంలో భక్తులు మండల దీక్షను స్వీకరించారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. దీంతో జిన్నారంలోని కోదండ రామాలయ అయ్యప్ప సన్నిధానం అయ్యప్ప స్వాములతో సందడిగా మారింది. మండల దీక్షలో భాగంగా 45 రోజుల పాటు నియమ నిష్ఠలతో స్వామివారిని ఆరాధిస్తూ దీక్షను కొనసాగించనున్నట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.