BREAKING
సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్ బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్ భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం

జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి
సూర్య జగిత్యాల అర్బన్ ;;జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్ఓ  కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఇందూర్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ కు బీజేపీ బీడీ కార్మిక సెల్ నాయకులు ఆదివారం వినతిపత్రం అందజేశారు.జిల్లా కన్వీనర్ కట్టా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో లక్షలాది మంది మహిళా బీడీ కార్మికులు, ప్యాకర్స్, చాటింగ్, బట్టీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రీజినల్ కార్యాలయాలు కరీంనగర్, నిజామాబాద్ లో ఉండటంతో చిన్న చిన్న పనులకు కూడా కార్మికులు పని మానుకొని, కుటుంబాన్ని వదిలి అక్కడికి వెళ్లాల్సి వస్తోందన్నారు. డెత్ సర్టిఫికెట్, జెన్యూనిటీ సర్టిఫికెట్ వంటి పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.అలాగే 1995 చట్టం ప్రకారం 58 ఏళ్లకు రూ.2000 పెన్షన్ వస్తుండగా, 50 ఏళ్లకే తీసుకుంటే 32% కోతతో రూ.1320 మాత్రమే వస్తోందని, కనీస పెన్షన్ ను రూ.1000 నుండి రూ.5000 కు పెంచాలని డిమాండ్ చేశారు.
 
కార్యక్రమంలో కో-కన్వీనర్ బండారి ప్రభాకర్, బండారి గంగారెడ్డి, హనుమాన్లు, గంగారం, లక్కం సంజీవ్, తోగిటి అంజయ్య, భారత వీలింగారెడ్డి, కమిషన్ ఏజెంట్లు గంగాధర్, రమేష్, కార్మికులు సుధా, పద్మ, రాధిక, సుజాత, సబియా బేగం, మమత, ఆసియా బేగం, పర్వీన్ సుల్తానా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.