BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

Select Suryaa Now
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట మండల కాపు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

అశ్వారావుపేట రింగ్ రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించారు.

అనంతరం నాగబాబు నాయుడు కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కాపు సంఘం నాయకులు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాపు, మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం నాగబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కాపు సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దండా బత్తుల నరేష్, దండా బత్తుల రమేష్, కొట్టే శ్రీనివాసరావు, పసుపులేటి ఫణీంద్ర, స్థానిక నాయకులు తిరుమల శెట్టి అప్పారావు, మాధురి మధు, మాధురి జీవన్ క ట్టా శ్రీనివాసరావు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట