BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు

Select Suryaa Now
సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు
సూర్య,మంథని రూరల్: మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు,సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  తుది శ్వాస విడిచారు.ఆయన మరణంతో మంథని జర్నలిస్ట్ వర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.రామ్ కుమార్ విద్యార్థి దశ నుంచే అనేక సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు.అనంతరం సుదీర్ఘ కాలం పాటు మంథని కేంద్రంగా జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో పనిచేస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చొరవ చూపారు.పేద ప్రజల గొంతుకగా,అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలను తెలియజేయడంలో ఆయన ముందుండేవారు.సామాజిక స్పృహ,నీజాయితీ, నిర్భయ జర్నలిజం ఆయన ప్రత్యేకత.మంథనిలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ప్రజా సమస్యల పోరాటాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు.ఆయన మృతి పట్ల మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్ ఉపాధ్యక్షులు బర్ల సంపత్ ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య సహాయ కార్యదర్శి గంధం అంజి బాబు కోశాధికారి తగరం రాజు,సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి కొమురోజు చంద్రమోహన్,ఆంకరి ప్రకాష్,కంది కృష్ణారెడ్డి,ఆర్ల బాపు,లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్,ఓజ్జల శ్రీనివాస్,లింగాల సురేష్ దొరగోర్ల రవీందర్,కేసారపు  రవి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు,ప్రజా సంఘాలు సంతాపం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.