BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు

Select Suryaa Now
టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు

 

- సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి


సంతబొమ్మాళి, నవంబర్ 1, మేజర్ న్యూస్ :

సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం పంచాయతీలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జెడ్పీటీసీ పుక్కళ్ళ పద్మావతి , ఎంపీటీసీ అభ్యర్థి బెండి సంజీవమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి బెండి సంజీవమ్మ మాట్లాడుతూ,  పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ళ పద్మావతి శ్రీనివాస ని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో దుపాన రమణారెడ్డి,పుక్కళ్ళ శ్రీనివాస్, ఆరంగి వసంత్, ఐటీడీపీ మండల అధ్యక్షులు బెండి అరుణ్ కుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.