BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు.

Select Suryaa Now
పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు.

 

పలాస, నవంబర్ 1,మేజర్ న్యూస్.

పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల పాలింగ్ రోజు,ఆదివారం ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 11వ వార్డు అభ్యర్థి మీసాల సుశోభిత భర్త మీసాల సురేష్ బాబుతో పాటు తన అనుచరులు అర్ట్ లక్ష్మణ్, బోనెల రమేష్ లను, 6వ వార్డు వైసిపి అభ్యర్థి దువ్వాడ సత్యవతి భర్త దువ్వాడ రమణయ్యతో పాటు వారి అనుచరులు కొంత మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరి ఇద్దరిపై రౌడీ షీటర్ కేసులు ఉండగా వీరు పాలింగ్ కేంద్రం వద్దకు రావడంతో వీరిపై ముందుగా పొలీసులు బైండోవర్ కేసులు విధించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వీరిని అదివారం ఉదయం పోలీసులు అదుపులోనికి తీసుకొని పొలింగ్ జరిగిన అనంతరం వీరిని విడిచిపెట్టారు. అదే విదంగా 19వ వార్డు పాలింగ్ కేంద్రం 19/1, 19/2 పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా, టిడిపి నాయకులు మద్య చిన్నపాటి వాగ్వివాదాలు జరిగాయి, అదే విదంగా 21వ వార్డు పొలింగ్ కేంద్రం 21/2 వద్ద టిడిపి, వైకాపా నాయకులు మధ్య వాగ్వివాదాలు జరగగా టిడిపి నాయకులు వైకాపా నాయకులు టెంట్ను తోసి వేయడంతో చిన్న పాటి ఘర్షణ జరగగా పోలీసులు వచ్చి ఇరువర్గాలను అదుపుచేశారు.