BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

Select Suryaa Now
మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

 

∆. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి

∆. జెడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి వసంతరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి సూరాడ హేమలత విజ్ఞప్తి

సంతబొమ్మాళి, నవంబర్ 1, మేజర్ న్యూస్ :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జెడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి వసంతరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి సూరాడ హేమలత జోగారావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి సూరాడ హేమలత జోగారావు మాట్లాడుతూ, గతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని తెలిపారు. ఎంపీటీసీగా మరోసారి అవకాశం కల్పిస్తే మేఘవరం పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి వసంతరెడ్డిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించి ప్రజాసేవకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేఘవరం పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు.