BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం

Select Suryaa Now
రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం

 

నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. పాఠశాలల్లో భద్రతను పటిష్ఠం చేయాలి
"లయన్ డా. ఎం.కె. మిశ్రో డిమాండ్"

ఎల్ ఎన్ పేట నవంబర్ 1, మేజర్ న్యూస్:

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో పాటు, ఆమెను రక్షించేందుకు అడ్డుగా వచ్చిన మరో విద్యార్థిపై కూడా దాడి చేయడాన్ని దివ్యాంగ ఉద్యోగ సంఘం, సక్షం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక, లయన్స్ క్లబ్, ఎస్.జి.టి.ఎఫ్. సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని లయన్ డా. ఎం.కె. మిశ్రో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోకి చొరబడి విద్యార్థులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసి విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించేలా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లను కోరారు. విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.