BREAKING
బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత గుజరాత్ ఐక్యత దినోత్సవ వేడుకల్లో నల్లగొండ సర్పంచులు

ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి

Select Suryaa Now
ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రేణిగుంట రోడ్డు లోని డా.అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులు పాటు నిర్వహించిన తొలి అంతర్జాతీయ న్యాయ ముట్ కోర్టు పోటీ "ఫియట్ జస్టీషియా 2026" ఘనంగా ఆదివారం ముగిశాయి. కళాశాల మూట్ కోర్టు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక న్యాయ పోటీలలో దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన శాస్త్ర, ధనలక్ష్మి శ్రీనివాసన్, ఐసిఎఫ్ఏఐలా స్కూల్, భారతీ విద్యాపీఠ్, బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ లా, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎస్ వి యూనివర్సిటీ తదితర రాష్ట్రాలకు చెందిన 17 ప్రముఖ విశ్వవిద్యాలయాలు, న్యాయ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకు జస్టిస్ డా.వి.ఆర్.కె. కృపాసాగర్, విశ్రాంత న్యాయమూర్తి జి.అన్సర్ బాషా, ప్రొఫెసర్ టి.వి. సుబ్బారావు, బి. సాంబశివరావు, డా.ఎన్.ఎస్.సోమన్, ప్రొఫెసర్ ఎస్.వి.పుల్లారెడ్డి, డా.మండవ రామకృష్ణ ప్రసాద్, ప్రొఫెసర్ డా.మీనా కేతన్ సాహు, డా. నీలం జనార్థనరెడ్డి, డా.దిల్షాద్ షేక్ తదితర ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1,35,000 నగదు బహుమతులు ప్రకటించి అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా.ఆర్. తిప్పారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి న్యాయపరమైన అవగాహన, ఆచరణాత్మక అనుభవం కల్పించాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ఎదగాలనుకునే విద్యార్థులకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. న్యాయ విద్యార్థుల్లో న్యాయ పరిశోధన, వాదనా పటిమ, న్యాయ నివేదికల తయారీ, విశ్లేషణాత్మక ఆలోచన న్యాయస్థానాల్లో వాదించే నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ న్యాయశాస్త్రానికి సంబంధించిన మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలు వంటి సమకాలీన అంశాలపై విద్యార్థులు తమ వాదనలను సమర్థవంతంగా వినిపించారు.కళాశాల ప్రిన్సిపాల్ డా.బిజయ్ కుమార్ బెహరా పాల్గొన్న విద్యార్థులను, న్యాయనిర్ణేతలను అభినందిస్తూ, కృషి చేసిన అధ్యాపకులు, మూట్ కోర్టు సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డా.అదురి సరదమ్మ, వైస్ ప్రెసిడెంట్ డా.ఆర్.లక్ష్మీ గాయత్రి, కార్యదర్శి ఆర్.లక్ష్మీ ప్రశాంతి పర్యవేక్షణలో నిర్వహించారు. కన్వీనర్ జాలీ పి.ఆర్, కో-కన్వీనర్లు రేష్మి ఆర్, శుభమస్తు పాండా తదితరులు కృషి చేశారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్