BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Select Suryaa Now
 శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌ఐఆర్‌ (SIR), ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) నిబంధనలపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని సీసీఆర్‌టీ ప్రాంగణంలో మేధావుల సదస్సు నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశ భద్రత, ఆర్థిక పారదర్శకత, సార్వభౌమాధికార పరిరక్షణే ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలని పేర్కొన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ద్వారా విదేశీ నిధుల వినియోగంపై నియంత్రణ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్‌ రాజకీయం చేయడం సరికాదన్నారు.రవికుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. జాతీయ భద్రత, దేశ సమగ్రతను కాపాడేందుకే కేంద్రం సంస్కరణలు చేపడుతోందన్నారు. మేధావులు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటీ నిపుణులు, న్యాయవాదులు, పరిశోధకులు, విశ్రాంత అధికారులు అడిగిన ప్రశ్నలకు నేతలు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.