BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్

Select Suryaa Now
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
ఆదిలాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని కోరారు. రైతులతో పాటు కౌలు రైతులకు, భూమిలేని రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 
తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి కరువు పరిస్థితులు లేవని, సాగునీటి వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
గోదావరిలో వరద నీరు సముద్రంలో కలుస్తున్నా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగిస్తే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. నీళ్లు అందిస్తే యూరియా సరఫరా చేయాలి, పంటలు కొనుగోలు చేయాలి, బోనస్ చెల్లించాలనే బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం సాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చనాక-కొరాట ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తయినా కాలువల నిర్మాణం చేపట్టడం లేదన్నారు.
 
రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం అన్నీ సంక్షోభంలో పడ్డాయని, మంచిగా ఉన్న విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నా స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదన్నారు. పరిశ్రమలను కాపాడటంతో పాటు మెడికల్, నర్సింగ్ కళాశాలలు, జాతీయ విద్యాసంస్థలను ఆదిలాబాద్‌కు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సింగరేణిని కూడా బొగ్గు కుంభకోణాలతో దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని, ఢిల్లీలో ఒకటిగా ఉంటూ తెలంగాణలో మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నాయకులు రైతుల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమస్యలకు పరిష్కారం చూపకుండా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకే పరిమితమవుతున్నారని అన్నారు
గత నెలలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందడం పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి బీఆర్ఎస్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస భద్రత, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.