ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు
చందానగర్,మేజర్ న్యూస్ : స్థానిక ఎంపిపి ఎస్ సిద్ధిక్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో టిఎఫ్ సి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TFC వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి, సినీనటి ఫరియా అబ్దుల్లా, బిగ్‌బాస్ ఫేమ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖుల రాకతో పాఠశాలలో సందడి నెలకొంది. విద్యార్థులతో కలిసి వారు దీపావళి సంబరాల్లో పాల్గొని చిన్నారుల్లో ఆనందాన్ని నింపారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇటువంటి ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న TFC సేవలను పాఠశాల వర్గాలు అభినందించాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మి, ఫరియా అబ్దుల్లా, చరణ్‌తో పాటు TFC బృందానికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.