ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డి, చైర్మన్ శివచరణ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.