BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం

Select Suryaa Now
భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే  ఆనంద బాబు విస్తృత ప్రచారం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆదివారం భట్టిప్రోలు మండలం భట్టిప్రోలు, అమృతలూరు మండలం ఇంటూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భట్టిప్రోలు గ్రామంలో ఎంపీటీసీ  సెగ్మెంట్-3 అభ్యర్థి గాత్రం సౌమ్య శ్రీ,సెగ్మెంట్-1 కట్టా కృష్ణ, సెగ్మెంట్-2 మండూరు సునీల్ బాబు, సెగ్మెంట్-4 కటకం కుమారస్వామి విజయాన్ని కాంక్షిస్తూ ఓటర్లను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. జడ్పిటిసి  అభ్యర్థి నక్కా శ్రీనివాసరావుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఎంపీటీసీ  సెగ్మెంట్-1 పాములపాడు చంద్రిక భవాని, సెగ్మెంట్-2 జాలాది వెంకటయ్య,అమృతలూరు జడ్పిటిసి  అభ్యర్థి పల్లెంపాటి బాలాజీలకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ - కూటమి అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, టిడిపి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై, జనసేనకు గ్లాసు గుర్తుపై, బిజెపికి  కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.