BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
 
​దండేపల్లి ;;మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం గుట్ట గోదావరి పుష్కర ఘాట్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ నిర్మాణాలు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని తేల్చిచెప్పారు.​పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌లు, మరుగుదొడ్లతో పాటు తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.