BREAKING
రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మన ఎల్లారెడ్డి వాసి చలో ఆదిలాబాద్ బి ఆర్ ఎస్ గర్జన సభ. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్ ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్ బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్ భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

Select Suryaa Now
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

సూర్య భైంసా;;ప్రభుత్వ డిగ్రీ కళాశాల,భైంసాలోని జంతుశాస్త్ర విభాగం మరియు భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో క్షేత్ర పర్యటన నిర్వహించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు భైంసా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఎక్స్-రే కిరణాల వినియోగం, వైద్య పరీక్షల్లో వాటి ప్రాముఖ్యత,అల్ట్రాసౌండ్ పరీక్షల విధానం, ఫిజియోఎలక్ట్రిక్ ప్రభావం గురించి తెలుసుకున్నారు.అలాగే వైద్య రంగంలో భౌతిక శాస్త్ర సూత్రాలు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వైద్య సిబ్బంది ద్వారా అవగాహన పొందారు.అనంతరం విద్యార్థులు భైంసా చేపల మార్కెట్ ను సందర్శించారు.అక్కడ వివిధ రకాల చేపలను పరిశీలించి, చేపల రకాలు, వాటి లక్షణాలు, ఆహారంగా వాటి ప్రాముఖ్యత, చేపల విక్రయ విధానం మరియు మత్స్య సంపద గురించి తెలుసుకున్నారు. చేపల మార్కెట్‌లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు,డిజిటల్ తూకం యంత్రాల పనితీరును కూడా పరిశీలించారు.ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించింది. విజ్ఞాన శాస్త్రాన్ని నిత్యజీవితంలో మరియు వివిధ రంగాల్లో ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశీలనా శక్తిని మరియు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడింది అని కళాశాల ఇంచార్జి జె.భీమ్ రావు  తెలియజేసినారు జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కోసర్ సంతోష్ కుమార్ గారు మరియు భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు కోసారి శ్రావణ్య విద్యార్థులు పాల్గొన్నారు.