BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్

Select Suryaa Now
అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్

                                  మసీదుబండలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ సన్నాహక సమావేశం
కొండాపూర్,మేజర్ న్యూస్ : నవంబర్ 2న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మసీదుబండలోని బీజేపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం స్థాయి మహా పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రవికుమార్ యాదవ్, మహా పాదయాత్ర కన్వీనర్ సిద్ధం నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఇన్‌ఛార్జ్ ఆలె భాస్కర్ హాజరయ్యారు.ఈ సమావేశంలో రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నవంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వరకు మహా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం జిల్లా ఇన్‌ఛార్జ్ ఆలె భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేపడుతున్న మహా పాదయాత్రకు ప్రజలందరూ ఏకమై మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఎల్లేష్, అనిల్ గౌడ్, మాణిక్ రావు, స్వామి గౌడ్, దయాకర్, గోపాల్ రావు, దుర్గా ప్రసాద్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.