telangana
రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మన ఎల్లారెడ్డి వాసి
సూర్య ఎల్లారెడ్డి ఉమ్మడి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి చెందిన కీర్తిశేషులు మైసనీ రామా గౌడ్ ,తులసమ్మ దంపతులకు నాలుగవ కుమారుడుగా జన్మించిన అతడికి విద్యాభ్యాసం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చదువు చదువుకున్నారు చదువులోనూ ఆటలలోను మేటిగా ఉంటూ అంచెలంచలుగా విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూ అతెట్లిక్ లో జిల్లా టాపర్గా నిలిచారు కొన్ని అనివార్య కారణాలవల్ల ఎల్లారెడ్డి నుండి హైదరాబాద్ రాంనగర్ కు ప్రాంతానికి మకాం మార్చారు అక్కడ ఉంటూ తన వ్యాపారాలు చేస్తూ అక్కడ యువతతో పరిచయాలు పెంచుకొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ లో పనిచేస్తు అవే భావాలను ఆ యువతకు నూరి పోసేవారు రాంనగర్ ప్రాంతంలో తనదైన శైలిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను అద్భుతంగా చేపట్టేవారు అందుకు అతని మిత్రులు ఎల్లవేళల సహకరించేవారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని అక్కడి యువత అతనిని కోరింది కానీ సున్నితంగా తిరస్కరించారు ఆదిష్టానం దృష్టిలో ఉండాలని ఆయన భావన అదే భావనతో అధిష్టానం దృష్టిలో పడ్డానాని బిజెపి అధిష్టానం మైసని సుదర్శన్ గౌడ్ ఎల్లారెడ్డి సూర్య మేజర్ న్యూస్ తో చరవాణిలో తెలిపారు హైదరాబాద్లోని రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్య క్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు మైసాని సుదర్శన్ గౌడ్ నియమి తులయ్యారు. ఆయన నియామకాన్ని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శక్తిసింగ్ ప్రకటించారనీ తెలిపారు.ఈ సందర్భంగా శనివారం ఆయన ఎల్లారెడ్డి పాత్రికేయ మిత్రులతో కూడా మాట్లాడినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేస్తానని, తన సేవలను గుర్తించి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేసేలా కృషి చేస్తానని అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చేలా చేస్తానన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ పదవి ఇచ్చినందుకు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి భరత్ గౌడ్, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శక్తిసింగ్ లకు ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.