ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు
సూర్య జైపూర్ దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దేశంలో జరుగుతున్న ఓటు చోరీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ సభ నిర్వహించారు. సభను విజయవంతం చేయాలనే రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల విశ్వంబర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గోనె నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శులు మంతెన లక్ష్మణ్, వేముల రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఉస్కమల్ల రవి, సర్పంచ్ తాళ్లపెల్లి అంజన్ గౌడ్, సీనియర్ నాయకుడు మున్నాభాయ్ తదితరులు పాల్గొన్నారు.