BREAKING
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్ బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్ భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!!

Select Suryaa Now
చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!!

విజయనగరం బ్యూరో సూర్య: ోరు ముగిసింది. నేతలరాతలు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులు లెక్కల్లో మునిగారు. ఎక్కడెన్ని పోలయ్యాయి? వాటిలో ఎవరికెన్ని దక్కే అవకాశం ఉంది? క్రాస్ ఓటింగు సంగతేంటి? ఫలితం ఉజ్జాయింపుగా ఎవరికి అనుకూలం? మెజారిటీ కథేంటి? ఇలా సాగుతున్నాయి శిబిరాల్లో కూడికలు, తీసివేతలు! బైటకు మాత్రంమాత్రం మేకపోతు గాంభీర్యం. లోలోపల కలవరం. అధికార కూటమిలో హుషారు. విపక్ష వైసీపీలోనూ అదేతీరు. లుకలుకలు కలిసొస్తాయని ఆశ. క్రాస్ ఓటింగుపై అందరిలోనూ అనుమానం. ఎవరికొంప మునుగుతుందోనని భయం.సందట్లో సడేమియాలా ఇతర పార్టీలూ గుణకారాలు తీసివేతలు. కీ రోల్ మాదేనని స్వతంత్రులు దింపుడుకళ్ళం ఆశలు. పార్టీల్లోనూ అదే ఆలోచన. ఎడ్జ్ దగ్గర ఆగిపోతే, ఎలా అంటూ సమాలోచనలు.ఇంకోవైపు, పంపిన డబ్బు పూర్తిగా పంపిణీ అయిందా లేదా అంటూ అభ్యర్థులు ఆరాలు. మమ్మల్నే అనుమానించుటయా అంటూ కొందరు విసుర్లు.పోలింగు పూర్తయిందే తడవుగా పార్టీల శిబిరాల్లో ఒకటే చర్చలు. డివిజన్, వార్డుల్లో అనుకూలత, ప్రతికూలతపై బేరీజులు. ఫైనల్ గా ఫలితం ఆశాజనకమని అనిపిస్తే ఊపిరి పీల్చుకోవడాలు. అనుమానం కలిగితే నిట్టూర్పులు.మూడో తేదీన ఓట్ల లెక్కింపుపై లెక్కలు. కౌంటింగ్ ఏజెంట్ల కూర్పుపై కసరత్తులు. నమ్మకస్థుల జాబితాలతో ఒకటికి రెండుసార్లు ఎక్సర్సైజులు. దెబ్బేయరుకదాని ఎంక్వయిరీలు. ప్రత్యర్థి కౌంటింగ్ ఏజెంట్లపైనా వాకబులు. ఏమైనా సహకరిస్తారేమోనని ఆశలతో రాయ'బేరాల'కు యత్నాలు!అబ్బో, అసలు రాజకీయం ఇప్పుడే మొదలైందా అన్నంత హడావుడి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఒకింత ఉత్కంఠ వాతావరణం. మూడోతేదీవరకు తప్పని నిరీక్షణ. మద్దతుదారులు, కేడర్లో ఒకటే ఆతృత. చూడాలిమరి, ఎవరి ఫేట్ ఎలాఉందో. కౌంటింగ్ సెంటర్లో కంటతడిపెట్టేదెవరో! ఇంటికెళ్లి ఏడ్చేదెవరో!! తెలియాలంటే 3వతేదీ వరకూ ఓపిక పట్టాల్సిందే.