BREAKING
ఘనంగా బోనాల పండుగ.. ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించి డీఏలను మంజూరు చేయాలని డిమాండ్..... మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మన ఎల్లారెడ్డి వాసి చలో ఆదిలాబాద్ బి ఆర్ ఎస్ గర్జన సభ. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్ ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్

వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు

Select Suryaa Now
వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి గ్రామానికి చెందిన 24 కుటుంబాలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్‌లో సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర టీడీపీ కండువాలు కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధితోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు గౌరవం కల్పిస్తామని అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, యారవ శ్రీనివాసులు, గుంటుపల్లి శ్రీనివాసులు, బైరెడ్డి వెంకటేశ్వర్లు, పారా వెంకటేశ్వర్లు, నాగశేషులు, ఎలికా నారాయణ, దేవన బోయిన నాగార్జున, రెక్కల రమణారెడ్డి, దారపనేని బాల చెన్నయ్య, బైరెడ్డి సురేంద్ర రెడ్డి, బైరెడ్డి నాగిరెడ్డి, సుభాని, ముక్కు తిరుపతయ్య  తదితరులు పాల్గొన్నారు.