BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

Select Suryaa Now
మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ  శంకుస్థాపన

                                         పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి
మాదాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.9 కోట్ల 14 లక్షల 35 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, గుట్టల బేగంపేట్ స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ మేరకు  అరుణోదయ కాలనీ, అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్, ఆదిత్య నగర్, మాతృశ్రీ నగర్, సిద్ధి వినాయక నగర్, గుట్టల బేగంపేట్, సర్వే ఆఫ్ ఇండియా, సైబర్ హిల్స్ ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గుట్టల బేగంపేట్ స్మశాన వాటికను రూ.2 కోట్లతో ప్రహరీ గోడ, దహనవాటిక, స్నానపు గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలతో ఆధునికీకరిస్తామని తెలిపారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి కాల్వల పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.