telangana
ఘనంగా బోనాల పండుగ..
సూర్య-నవీపేట్ మండల కేంద్రంతోపాటు రాంపూర్, మోకన్ పల్లి గ్రామాల ప్రజలు ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. గాండ్ల తేలికుల సంఘం, మున్నూరు కాపు సంఘాలు గ్రామదేవతలకు కొత్త కుండలలో అన్నము, బెల్లము, పాలు కలిపి వండి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి మహిళలు బోనాలను తలపై పెట్టుకుని ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడిపంటలు ధనధాన్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూనాది అంజయ్య, వార్డు సభ్యులు భూనాది నవీన్, భూనాది మంజుల ప్రవీణ్, దేవేందర్, శ్రీనివాస్ రవి చందు రాజమణి, సునంద, సావిత్రి, సుజాత, సుకృత, రచన, రాధిక తదితరులు పాల్గొన్నారు.