telangana
ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ;;ఆదిలాబాద్ జిల్లా వనవాసి కళ్యాణ పరిషత్ మరియు హైదరాబాద్ శంకర నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 24 నుండి నవంబర్ 1 వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ నాగోబా విద్యార్థి నిలయం, ఇంద్రవెల్లిలో నిర్వహించిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరం ఆదివారం ఉదయం ముగింపు కార్యక్రమంతో విజయవంతంగా ముగిసింది.
ఈ శిబిరంలో మొదటి ఐదు రోజుల పాటు నిర్వహించిన OP సేవలను మొత్తం 624 మంది వినియోగించుకున్నారు. వీరిలో 162 మందిని కంటిపొర శస్త్రచికిత్సలకు ఎంపిక చేయగా, ఇప్పటివరకు 150 మందికి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు వనవాసి కళ్యాణ పరిషత్ అఖిల భారతీయ ఉపాధ్యక్షులు శ్రీ హెచ్.కె. నాగు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనవాసి కళ్యాణ పరిషత్ ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, కంప్యూటర్ శిక్షణ తదితర అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.
ప్రాంత సంఘటన మంత్రి శ్రీ వెమూక ఆంజనేయులు మాట్లాడుతూ ఆదివాసీ బంధువుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, వైద్యం, భజన తదితర 14 రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ మేస్త్రం జంగు గారు,శంకర నేత్రాలయ క్వార్డినేటరే రాజు,సార్మేది దుర్గు , అనిల్, లక్ష్మణ్, ప్రకాష్ ,మాణిక్ రావు, సంతోష్, సూర్యభాన్ తదితరులు పాల్గొన్నారు.