telangana
రెంజల్ లో ఊర పండుగ
సూర్య రెంజల్ : మండలంలోని రెంజల్ గ్రామంలో ఊర పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తిరుపతి లలిత తెలిపారు. గురువారం రోజున బండారి పోసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, నేడు ఆదివారం రోజున సాయంత్రం మోగించి, సోమవారం రోజున గ్రామదేవతలైనటువంటి అమ్మవార్లకు ప్రతిష్టించి, బలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గ్రామానికి ఎలాంటి అంటువ్యాధులు రాకూడదని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పండుగ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొననున్నారు.