నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం
సూర్య కుబీర్ ;రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా గిరి జన మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ఎంపీ శ్రీ మన్న లాల్ రావత్ గారు నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు పండిత్ జాదవ్ గారిని సన్మానించారు.రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నేనావత్ రవి నాయక్ గారి సూచన మేరకు క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది.జాతీయ నాయకుల చేతుల మీదుగా సన్మానం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, మరింత ఉత్సాహంతో గిరిజనుల కోసం పనిచేస్తానని పండిత్ జాదవ్ తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు.