పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్
దోమ, మేజర్ న్యూస్:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులతో పాటు మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, తమతో పాటు ఇతర అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన పట్టభద్రులను కోరారు.