BREAKING
రెంజల్ లో ఊర పండుగ ఘనంగా బోనాల పండుగ.. ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించి డీఏలను మంజూరు చేయాలని డిమాండ్..... మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన రాంనగర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మన ఎల్లారెడ్డి వాసి చలో ఆదిలాబాద్ బి ఆర్ ఎస్ గర్జన సభ. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అమిత్ షా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలి: రవికుమార్ యాదవ్ ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత - మంథని ప్రెస్ క్లబ్ లో విషాద ఛాయలు శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్రం ప్రాధాన్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు

గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం

సూర్య  దండేపల్లి ;;గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్రంభీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, డిసిపి ఎ.భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఇన్చార్జి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సురేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1940లో కుమ్రంభీమ్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, జల్ - జంగల్ - జమీన్ నినాదంతో గిరిజనుల నీరు, అడవి, భూమిపై హక్కుల కోసం పోరాడారని తెలిపారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా, మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని, అదే తరహాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలను విద్యా ప్రమాణాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రతిరోజు వందల మంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, వెంటిలేటర్లు, మానిటర్లు, ల్యాపరోస్కోపీ వంటి ఆధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల వైద్య సేవలను మెరుగుపరిచేందుకు సుమారు 3 కోట్ల రూపాయలతో వెంటిలేటర్లు, ఇతర అత్యవసర పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకున్నామని, అదనంగా 4 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం-2006 క్రింద అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం పట్టాలు మంజూరు చేస్తామని, అధికారులు పూర్తి వివరాలతో పరిశీలన చేయాలని సూచించారు. చిన్న తరహా అటవీ ఉత్పత్తులైన పండ్లు, తేనె, వెదురు, కట్టెలు తదితర ఉత్పత్తులపై గిరిజనులకు ఉన్న హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అని, ఈ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టైగర్ రిజర్వ్, నేషనల్ పార్క్ పరిధిలోని గ్రామాల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, అక్కడి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, అటవీ ప్రాంతాలలో విద్యుత్, రహదారులు, త్రాగునీరు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు కల్పించడంలో ఉన్న పరిమితుల దృష్ట్యా, గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పునరావాసానికి ముందుకు వస్తే మెరుగైన సౌకర్యాలు అందుబాటులో వచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు తమకు అవసరమైన భూమి, పరిహారం, పునరావాస సౌకర్యాలకు సంబంధించి సముచితమైన ప్రతిపాదనలు సమర్పించాలని, న్యాయబద్ధమైన పరిహారంతో పాటు మెరుగైన నివాస స్థలం, సమగ్ర వ్యవసాయ భూమి, విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, త్రాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గ్రామస్తుల అంగీకారం లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవడం జరగదని తెలిపారు. అటవీ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కొన్ని రహదారులకు సంబంధించి సమస్యలు పరిష్కారమయ్యాయని, మిగిలిన ప్రాంతాలలోను నిబంధనల మేరకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అటవీ హక్కులు, రహదారులు, ఇతర సమస్యలపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు నేరుగా ప్రతిపాదనలు అందించాలని సూచించారు.

మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదివాసీ కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అడవి బిడ్డల హక్కులను కాపాడిన మహనీయుడు అని తెలిపారు. కుమ్రంభీమ్ ఆశయాలను భావితరాలకు తెలియజేస్తూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు శాశ్వత ఆదాయ మార్గాలు కల్పించేందుకు అటవీ శాఖ అధికారులతో చర్చించి సుమారు 200 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున ఆయిల్‌పామ్ సాగు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, సోలార్ పంపుసెట్లు, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ సౌకర్యాలను కల్పించి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఇటీవల మూతపడిన వసతి గృహాన్ని ఐ టి డి ఎ పి.ఓ. 39 మంది విద్యార్థులతో తిరిగి ప్రారంభించి ప్రస్తుతం 7వ తరగతి వరకు విద్య అందించడం అభినందనీయమని, వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి వరకు తరగతులు విస్తరించాలని తెలిపారు. దండేపల్లి ప్రాంతంలో సుమారు 3 కోట్ల రూపాయలతో 100 మంది విద్యార్థులకు వసతి కల్పించే వసతి గృహం నిర్మాణం జరుగుతోందని, లింగాపూర్‌లో కూడా వసతి గృహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఇంటర్నేషనల్ హైస్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో అన్యాయాలను ఎదుర్కొనే చైతన్యం వస్తుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అదనంగా 50 పడకల క్రిటికల్ కేర్, ట్రామా కేర్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల వైద్యరంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు సుమారు 85 కోట్ల రూపాయలతో 4 లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు మంజూరై, టెండర్లు పూర్తయి, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు 2వ పంట సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం 2వ పంటకు సాగునీరు అందించే పరిస్థితి లేదని, పంట వేసి నష్టపోయే బదులు ముందుగానే జాగ్రత్త పడాలని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పద్మాపూర్ తదితర దేవాలయాలు, జాతర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ ప్రాంతాలలోని దేవాలయాల అభివృద్ధి విషయంలో అటవీశాఖ నిబంధనలను గౌరవిస్తూ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారుఅనంతరం మండలంలోని గుడిరేవు గ్రామంలో గల పద్మల్ పూరి కాకోబాయి (ఎత్మసార్) దేవస్థానాన్ని సందర్శించి దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కుమ్రంభీమ్ విగ్రహ ఆవిష్కరణకు ముందు మండలంలోని గూడెం సమీపంలోని గోదావరి తీర ప్రాంతంలో చేపట్టిన పుష్కర ఘాట్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారూ