పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్
పటాన్‌చెరు;హెరాయిన్ అక్రమ రవాణాకు సంబంధించిన మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పటాన్‌చెరు ఎక్సైజ్ ప్రత్యేక బృందం పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసింది. మాల్దా ప్రాంతంలో స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుంది.పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడు పరారీలో ఉండటంతో,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు అక్టోబర్ 25న ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, జిల్లా ఎక్సైజ్ అధికారి వై. రాధాకృష్ణ రెడ్డి, పటాన్‌చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి నిందితుడిని పట్టుకుంది.ఈ ప్రత్యేక బృందంలో ఎక్సైజ్ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ సాయిరాం, ఎక్సైజ్ ఉప పరిశీలకుడు ఫయాజ్, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు నెహ్రూ, రవికిరణ్, సంజయ్ పాల్గొన్నారు. నిందితుడిని నవంబర్ 1న సంగారెడ్డి న్యాయస్థానం ముందు హాజరుపరచగా,న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని ఎక్సైజ్ అధికారులు అభినందించారు.n