BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం

Select Suryaa Now
లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం

జిన్నారం;గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లక్ష్మీపతిగూడెంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధుల సహకారంతో సత్యసాయి పల్లకీ సేవ, మాతృమూర్తుల పాదపూజ కార్యక్రమాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి పల్లకీ సేవను భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం మాతృమూర్తులను గౌరవిస్తూ వారి పాదాలకు పూజలు నిర్వహించారు. మాతృమూర్తులను గౌరవించడం, సేవాభావాన్ని పెంపొందించడం, ఆధ్యాత్మిక విలువలను ప్రతి ఒక్కరిలో చాటిచెప్పడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పల్లకీ సేవ, పాదపూజ కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కుమ్మరి కృష్ణ, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.