BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

*వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి*

Select Suryaa Now
*వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి*

కోహిర్;భూగర్భ జలాల మట్టం రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోహిర్ మండల ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి నిల్వలను పెంచేందుకు బోర్‌వెల్ రీఛార్జ్ పద్ధతిని ప్రోత్సహించాలని, ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.బోరు బావుల సమీపంలో రీఛార్జ్ పిట్ నిర్మించి, వర్షపు నీటిని ఇసుక, కంకర, వివిధ పరిమాణాల రాళ్ల పొరల ద్వారా వడపోసి భూమిలోకి ఇంకేలా చేయవచ్చని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా వర్షపు నీరు భూగర్భంలోకి చేరి, భూగర్భ జలాల మట్టం పెరిగేందుకు దోహదపడుతుందని వివరించారు. ముఖ్యంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో బోర్‌వెల్ రీఛార్జ్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని ఎంపీడీవో ఉమాదేవి సూచించారు. భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.