ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎన్నికలు ఎంతో కీలకం అయినందున అందరూ ఓటరుగా నమోదు కావాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిలుపునిచ్చారు శనివారం రాత్రి ఎల్లారెడ్డి గూడ లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చదువుకున్న ఓటరు నాడి తెలియజేసే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు ద్వారా అస్తవ్యస్త పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో విష్ణు , శ్రీకాంత్, కిషన్, అరుణ్, కరణ్, దుర్గా, శివ తదితరులు పాల్గొన్నారు