అయ్యప్ప స్వాముల అన్న సమారాధన
కూకట్ పల్లి, మేజర్ న్యూస్:కెపిహెచ్‌బి కాలనీ రోడ్ నెంబర్ 2 నందు అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం (01-11-2026) రోజున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ సినీ నటులు శ్రీకాంత్, ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ అన్న సమారాధన కార్యక్రమం నేటి (01-11-2026) నుండి జనవరి 1, 2027 వరకు నిరంతరాయంగా కొనసాగనుంది.
మొదటిరోజు సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ సౌజన్యంతో ఈ అన్న సమారాధన అందించడమే కాకుండా, స్వయంగా పాల్గొని స్వాములకు పవిత్ర భిక్షాటన (అన్నదానం) వడ్డించారు. అయ్యప్ప స్వాముల సేవలో పాల్గొనడం ఎంతో పవిత్రమైన బాధ్యత అని, స్వాముల ఆశీస్సులు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, పాదం సూర్య, బండారి రమేష్, సుభాష్ స్థానిక నాయకులు అయ్యప్ప భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.