BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యం

Select Suryaa Now
కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు గోకవరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా కాలనీలు, వీధుల్లో పర్యటన సాగిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ దళిత నాయకులు వరసాల ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, యువతతో  కలిసి ఆయన ఇంటింటి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. గోకవరం ఎంపీటీసీ స్థానాలకు కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ-1 బీజేపీ అభ్యర్థిని దోసపాటి నాగ వరలక్ష్మి, ఎంపీటీసీ-2 టీడీపీ అభ్యర్థి ఆచంట రాజు, ఎంపీటీసీ-4 జనసేన అభ్యర్థి ప్రగడ ప్రభ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఎంపీటీసీ పరిధిలోని వివిధ కాలనీలు, వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థుల గురించి వివరిస్తూ, వారికి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కంబాల శ్రీనివాసరావు  పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన కూటమి అభ్యర్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.  కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి పట్టం కట్టినట్లేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా పనిచేస్తున్న నేపథ్యంలో అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు విజయానికి కృషి చేయాలన్నారు.