BREAKING
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

మేము సైతం

Select Suryaa Now
మేము సైతం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట పురపాలక సంఘ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోంది. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతతో పాటు వృద్ధులు సైతం ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలనే సంకల్పంతో వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం విశేషంగా నిలుస్తోంది.ఈ క్రమంలో మండపేట మెయిన్ రోడ్డులోని అన్నపూర్ణ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మానవత్వాన్ని చాటుకున్న పోలీసు సిబ్బంది సేవా దృక్పథం అందరి ప్రశంసలు అందుకుంది. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు సిబ్బంది ఆమెను చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా చేతులపై ఎత్తుకొని పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లారు. ఆమెతో ఓటు హక్కును వినియోగింపజేసిన అనంతరం తిరిగి పోలింగ్ కేంద్రం వెలుపలకు తీసుకొచ్చారు.వృద్ధురాలి పట్ల పోలీసు చూపిన ఆప్యాయత, సేవాభావం అక్కడున్న వారిని కదిలించింది. విధి నిర్వహణతో పాటు మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చిన పోలీసు తీరును ప్రజలు అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఇదిలా ఉండగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రాధాన్యత కల్పించి త్వరగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు పోలీసు, పోలింగ్ సిబ్బందికి సూచిస్తున్నారు. మొత్తంగా మండపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, సాఫీగా కొనసాగుతోంది. అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఓటు హక్కు పట్ల ఆసక్తి, వృద్ధుల భాగస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతోంది.