telangana
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;;ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు గత కొన్ని రోజులుగా తమ హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ లో చేస్తున్న నిరసన కు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా ధర్నా శిబిరానికి తరలి వెళ్లిన తెరవే ప్రతినిధులు సభ్యులు పాటలు పద్యాలు కవితలతో హోరెత్తించి ఉద్యమ స్ఫూర్తిని నింపారు.తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ ప్రతినిధులుగంగా ప్రసాద్ సింగర్ సంధ్య సింగర్ సావిత్రి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు చేస్తున్న ధర్నా శిబిరాన్ని సంఘీభావం తెలియ జేసి పాటలు కవితలు పద్యాలు పాడారు ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే హక్కుల సాధన లో తెరవే ముందుంటుందన్నారు
న్యాయమైన హక్కుల సాధింపబడాలని ఉద్యోగులు విజయాన్ని సాధించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ ఉపాధ్యక్షులు గంగా ప్రసాద్ తెరవే కార్యదర్శులు సింగర్ సంధ్య సావిత్రి ఎన్ హెచ్ ఎం జేఏసీ ప్రతినిధులు సునీల్ రాహుల్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.