బాధిత కుటుంబానికి కాలనీవాసుల ఆర్థిక సహాయం
సూర్య- బిక్కనూర్ ;;మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం భూదమ్మ అనారోగ్య సమస్యలతో ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక హరిజనవాడ కాలనీవాసులు ఆమె అంత్యక్రియల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో అండగా నిలిచిన కాలనీవాసులకు మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.