నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
అమీన్‌పూర్ ; అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని భవానీపురానికి చెందిన ప్రముఖ నాయకులు/గ్రామస్థులు అంబటి కిష్టారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వేడుక ప్రాంగణానికి విచ్చేసిన పాండురంగారెడ్డికి అంబటి కిష్టారెడ్డి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వేదికపైకి చేరుకుని నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా దీవించారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కాలనీవాసులు మరియు బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు
.